చెన్నైలో కొత్త రికార్డు సృష్టిస్తున్న నయన్ !

COCO

లేడీ సూపర్ స్టార్ నయనతార తాజాగా నటించిన చిత్రం ‘కొలమావు కోకిల’. ఆగస్టు 17న విడుదలైన ఈచిత్రం బాక్సాఫిస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. ఇక ఈ చిత్రం 15రోజులకుగాను చెన్నై లో రూ. 4.53కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టుకొని బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ రోజుతో అక్కడ 5కొట్ల క్లబ్ లో చేరనుంది ఈ చిత్రం.

ఇక తమిళనాడు వ్యాప్తంగా ఇప్పటివరకు ఈచిత్రం రూ. 23.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి కొత్త రికార్డు సృష్టించింది. సౌత్ లో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో ఈ తరహా కలెక్షన్స్ సాధించిన మొదటి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం.

నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈచిత్రం ‘కోకో కోకిల’ పేరుతో ఆగస్టు 31న తెలుగులో విడుదలైయి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంటుంది. అనిరుద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.

Exit mobile version