స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఈ ఏడాది మే నెలలో విడుదలై అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. కాని ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. వక్కతం వంశీ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పుడు హిందీ లో విడుదలవుతుంది. ‘సూర్య ది సోల్జర్’ పేరుతో హిందీలోకి అనువదించబడిన ఈ చిత్రం అక్కడ సెప్టెంబర్ 7న విడుదలకానుంది.
రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకం ఫై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించిన ఈచిత్రానికి బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ -శేఖర్ సంగీతం అందించారు. అను ఇమ్మాన్యుయెల్ కథానాయికగా నటించిన ఈచిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ ముఖ్య పాత్రలో నటించారు. మరి తెలుగులో మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈచిత్రం హిందీలో ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందో చూడాలి.
