
స్టార్స్ కు అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేసిన ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ హీరోగా ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సార్లు విడుదల తేదీ వాయిదా పడిన ఈ చిత్రం రేపు విడుదల అవ్వాల్సి ఉంది. కానీ తాజాగా మళ్లీ ఈ చిత్రం విడుదల తేదీ వాయిదా పడింది.
తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం గీతా ఆర్ట్స్ మరియు గ్లోబల్ సినిమాస్ కలిసి ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో సంయుక్తంగా విడుదల చేయనున్నాయి. కాగా ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ నాలుగవ వారంలో ఈ సినిమా విడుదల అవ్వబోతుంది. రాహుల్ సరసన కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. వి.ఎస్.క్రియేటివ్ వర్క్స్ బేనర్ పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కొత్త దర్శకుడు రాము కొప్పుల ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా దివ్య విజయ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.