చరణ్-ఉపాసనల వివాహ బంధానికి ఎనిమిదేళ్లు

charan upasana

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసనల పెళ్లి బంధానికి 8 ఏళ్ళు. వారిద్దరూ దాంపత్య జీవితం మొదలుపెట్టి ఎనిమిదేళ్లు పూర్తి అవుతుంది. వీరిద్దరి లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఉన్నతమైన కుటుంబాలకు చెందిన ఈ ఇరువురి పరిచయం స్నేహంగా ఆతరువాత ప్రేమగా మారింది. 2011లో ఒక ఇంటర్వ్యూలో తన ప్రేమ విషయం తొలిసారి బహిర్గతం చేశాడు చరణ్‌. దాన్ని లవ్ స్టోరీగా అతను చెప్పలేదు. తన క్లోజ్ ఫ్రెండ్‌ను పెళ్లాడబోతున్నానని మాత్రమే చెప్పాడు.

2011 డిసెంబర్ 11న చరణ్‌, ఉపాసనల నిశ్చితార్ధం వైభవంగా జరిగింది. ఆ తర్వాత ఆరు నెలలకు 2012 జూన్ 14న టాలీవుడ్‌, బాలీవుడ్‌, పొలిటికల్‌, బిజినెస్ రంగాలకు చెందిన మహామహుల సమక్షంలో అత్యంత గ్రాండ్‌గా జరిగిన వేడుకలో ఉపాసన మెడలో మూడు ముళ్లు వేశాడు చరణ్‌. టాలీవుడ్‌లో ఇలాంటి పెళ్లి ఈమధ్య కాలంలో చూడలేదని అంతా చెప్పుకున్నారంటే, ఎంత కన్నుల పండువగా ఆ పెళ్లి వేడుక జరిగిందో ఊహించుకోవాల్సిందే. అప్పట్నుంచీ ఐడియల్ కపుల్‌గా, ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా మెలగుతూ వస్తున్నారు.

Exit mobile version