టాలీవుడ్ యువ హీరో నితిన్, యువ భామలు కృతి శెట్టి, క్యాథరీన్ ల కలయికలో యువ దర్శకుడు ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా మాచర్ల నియోజకవర్గం. ఎంతో భారీ వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ మూవీ సాంగ్స్, టీజర్ ఇప్పటికే ఆడియన్స్ ని ఆకట్టుకోగా నేడు గుంటూరు లో జరిగిన ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ కి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసారు. ఇక కొద్దిసేపటి క్రితం ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసింది యూనిట్.
‘కలెక్టర్ గా మాచర్లలో ఎన్నికలు జరిపించడం నా బాధ్యత’, ‘నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ లాగా పంచ్ లు వీళ్ళేమో బోయపాటి శ్రీనివాస్ లా యాక్షన్ ఇప్పుడు నేనేమి చేయాలి రాజమౌళి సినిమాలో హీరోలా ఎలివేషన్ ఇవ్వాలా’, ‘కలెక్టర్ మీద చేయి వేస్తే గవర్నమెంట్ మీద చేయి వేసినట్లే’ అంటూ ట్రైలర్ లో నితిన్ పలికే పవర్ఫుల్ డైలాగ్స్ అదిరిపోయాయి. ఇక ట్రైలర్ లో గ్రాండ్ విజువల్స్, కామెడీ, యాక్షన్, ఫైట్ సీన్స్ తో పాటు బీజీఎమ్ కూడా బాగుంది. ఓవరాల్ గా మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ పవర్ ప్యాక్డ్ గా రూపొంది ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. కాగా ఈ మూవీని ఆగష్టు 12 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
