పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు మరోసారి తన కెరీర్ లో సినిమాలతో నాన్ స్టాప్ బిజీగా ఉన్నారు. ఓ సినిమా షూట్ తర్వాత మరో సినిమా షూట్ లో పాల్గొంటున్న తాను లేటెస్ట్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తో అయితే భారీ యాక్షన్ థ్రిల్లర్ “ఓజి” ని స్టార్ట్ చేశారు. అయితే దీని అనౌన్సమెంట్ వీడియోతో మరింత స్థాయిలో అంచనాలు పెంచుకోగా మరి ఈ సినిమాని అయితే అసలు ఊహించని రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మేకర్స్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.
ముఖ్యంగా డిస్టబింగ్ గా ఉండే సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా సుజీత్ ప్లాన్ చేస్తున్నట్టుగా లేటెస్ట్ అప్డేట్స్ చూస్తుంటే అర్ధం అవుతుంది. మరి ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమాలో ఒక సరికొత్త పవన్ ని ఈవిల్ మోడ్ లో అయితే చూసే ఛాన్స్ ఉన్నట్టే అనిపిస్తుంది. మరి తన అభిమాన హీరోని అయితే ఈ యంగ్ దర్శకుడు ఏ లెవెల్లో ప్రెజెంట్ చేస్తాడో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
