
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో నిర్మితం అవుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ సలార్ 1 సీస్ ఫైర్. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్ సెప్టెంబర్ 28న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచాయి.
ఇక తాజా టాలీవుడ్ క్రేజీ బజ్ ప్రకారం ఆగష్టు 15న సలార్ 1 ఫస్ట్ సాంగ్ ని అలానే నెలాఖరులో ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. అయితే ట్రైలర్ ని నెలాఖరులో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించినప్పటికీ రిలీజ్ డేట్ పై త్వరలో అనౌన్స్ మెంట్ రానుందని తెలుస్తోంది. ఇక అక్కడి నుండి వరుసగా ప్రమోషన్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్న యూనిట్, అన్నివిధాలుగా మూవీని ఆడియన్స్ కి ఫ్యాన్స్ కి చేరువ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారట. రవి బస్రూర్ మ్యూజిక్ అందించిన ఈ మూవీలో జగపతి బాబు, శ్రియా రెడ్డి, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరరావు కీలక పాత్రలు చేస్తున్నారు.