ప్రస్తుతం మన టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ హీరోస్ అయినటువంటి నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు ఇద్దరు కూడా పలు చిత్రాలులో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల రీత్యా వీరిద్దరు ఆఫ్ లైన్ లో పొలిటికల్ గా కలిసి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనితో ఇక మూవీ లవర్స్ కి ఇలాంటి ఇద్దరినీ కలిపి చూడడం మరింత ఆనందం కలిగిస్తుంది.
అయితే నిన్న ఓ భారీ మీటింగ్ లో బాలయ్య మాట్లాడుతున్నప్పుడు పవన్ తన దగ్గరకి రావడం ఇద్దరు కూడా ఫొటోస్ కి పోజ్ ఇవ్వడం లాంటి విజువల్స్ అయితే ఫ్యాన్స్ కి మంచి కిక్ ని కూడా ఇచ్చాయి. అయితే వీటితో పాటుగా ఓ పిక్ కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నడుమ మంచి వైరల్ గా మారింది. పవన్ మరియు బాలయ్య లు ఇద్దరు చేసుకున్న ఆప్యాయ ఆలింగనం పిక్ ఒక మిలియన్ డాలర్ మూమెంట్ పిక్ లా మారింది. దీనితో ఇది చూసిన పవన్ మరియు బాలయ్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
