మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో రీజనల్ ఇండస్ట్రీ హిట్ అందుకున్న మెగాస్టార్, ఇప్పుడు బాబీతో కలిసి బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర మొదలు పెట్టబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం, బాబీ ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం పక్కాగా ఫైనల్ స్క్రిప్ట్‌ను లాక్ చేశారు.
ఇదొక ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ఇందులో చిరంజీవి కోసం బాబీ ఒక సాలిడ్ క్యారెక్టరైజేషన్‌ను డిజైన్ చేశాడని, మెగాస్టార్ ఎంతో స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల కోసం టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖ నటులను రంగంలోకి దించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు.
ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ హైలైట్‌గా ఉండబోతోందని సమాచారం. బాబీ మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించే రేంజ్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను డిజైన్ చేశాడట. కెవిఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు త్వరలోనే నిర్వహించి, షూటింగ్ ప్రారంభించనున్నారు.
