తన అడ్డాలో బాలయ్యకి ఘనంగా సన్మానం.!

Bala krishna

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇపుడు ఎలాంటి ఫామ్ లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే ఈ ఫామ్ తర్వాత తన నుంచి క్రేజీ సీక్వెల్ చిత్రం “అఖండ 2” రానుండగా ఈ సమయంలోనే తనకి పద్మభూషణ్ గౌరవం రావడం అనేది మొత్తం నందమూరి అభిమానులకి ఎంతో గర్వకారణంగా మారింది. అయితే ఈ శుభ సందర్భాన్ని గ్రాండ్ గా బాలయ్య అభిమానులు జరుపుకున్నారు.

అతిరథ మహారథుల సమక్షంలో బాలయ్య అడ్డా హిందూపూర్ నియోజకవర్గంలో తనకి ఘనంగా సన్మాన సభని జరుపుకున్నారు. దీనితో అక్కడ బాలయ్య సతీసమేతంగా హాజరు కాగా పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. దీనితో అక్కడి విజువల్స్ కొన్ని ఇపుడు సోషల్ మీడియాలో అలాగే సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి. ఇక ఈ ఈవెంట్ పనులు అన్నీ అయ్యాక మళ్ళీ బాలయ్య అఖండ 2 షూటింగ్ లో పాల్గొననున్నారు.

Exit mobile version