K ర్యాంప్ షురూ చేసిన కిరణ్ అబ్బవరం.!

Kiran Abbavaram

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకడైన నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రీసెంట్ చిత్రం దిల్ రూబా తో పలకరించాడు. అయితే దీనికి ముందు కిరణ్ నటించిన చిత్రం “క” సినిమా తన కెరీర్ లోనే భారీ హిట్ గా నిలవగా ఈ చిత్రం హిట్ తో ర్యాంపేజ్ చూపించాడు ఈ యంగ్ హీరో.

ఇక దీనితో తన నెక్స్ట్ సినిమాల్లో ఒకటిగా క ర్యాంప్ అనే సినిమాని కూడా అనౌన్స్ చేయగా ఫైనల్ గా ఈ సినిమా షూటింగ్ లో యంగ్ హీరో బిజీ అయ్యినట్టుగా తెలుపుతున్నాడు. మళయాళంలో కనిపిస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ లోకేష్ పిక్ ని షేర్ చేసుకొని ఫన్ ఇప్పుడే మొదలైంది అంటున్నాడు. ఇక ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రం యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా రాజేష్ దండ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version