‘జై హనుమాన్’ పై బిగ్ అప్డేట్!

Jai Hanuman

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుల్లో తన ప్రతీ సినిమాతో అదరగొట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా ఒకరు. మరి ప్రశాంత్ వర్మ నుంచి వచ్చిన “హను మాన్” సినిమా అయితే మన తెలుగు ఆడియెన్స్ సహా పాన్ ఇండియా లెవెల్ ఆడియెన్స్ మెస్మరైజ్ అయ్యారు.

ఇక దీని తర్వాత సీక్వెల్ జై హనుమాన్ ని కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి హను మాన్ గా చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రాన్ని మన టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇపుడు ఈ చిత్రానికి మరో బిగ్ ఎడిషన్ దక్కింది.

లేటెస్ట్ గా ఈ సినిమా కోసం బాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ రావడం జరిగింది. వరల్డ్ వైడ్ గా భూషణ్ కుమార్ సమర్పణలో ఈ చిత్రం విడుదల కానున్నట్టుగా ఇపుడు వార్తలు కన్ఫర్మ్ అయ్యాయి. సో దీనితో జై హనుమాన్ రీసౌండ్ గట్టిగానే ఉండేలా ఉందని చెప్పాలి. ఇక ఈ అవైటెద్క్ చిత్రం అతి త్వరలోనే షూటింగ్ ని ఫుల్ ఫ్లెడ్జ్ గా మొదలు పెట్టుకోనుంది.

Exit mobile version