టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కొత్త ట్యాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆయన తన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి లేదా, ఇతర ప్రొడక్షన్ హౌజ్‌లపై కొత్త ట్యాలెంట్‌కు అవకాశం ఇస్తూ ఉన్నారు. ఇటీవల AI వినియోగం కోసం ఆయన సరికొత్త ఒరవడి తీసుకొచ్చారు. అయితే, ఇప్పుడు ఆయన తాజాగా ఓ బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు.
‘దిల్ రాజు డ్రీమ్స్’ సంస్థ ద్వారా సరికొత్త ట్యాలెంట్‌కు అవకాశం ఇచ్చేందుకు తాము ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. సినిమా రంగానికి కొత్త ట్యాలెంట్‌ను పరిచయం చేయడానికి తమ సంస్థ ఉపయోగపడుతుందని.. ఈ అవకాశం న్యూ టాలెంట్‌కు ఎంతో లాభదాయకంగా ఉంటుందని ఆయన అన్నారు.
ఈ సంస్థ ద్వారా తమ ట్యాలెంట్‌ను ప్రూవ్ చేసుకునేందుకు ఆసక్తిగల వారు తమ రిజిస్ట్రేషన్‌ను తమ వెబ్‌సైట్‌కు పంపవచ్చని ఆయన తెలిపారు. ఇలా కొత్త ట్యాలెంట్‌ను ప్రోత్సహిస్తున్న దిల్ రాజుకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.
A platform created for new talent ❤️????#DilRajuDreams is launching this June to create a space that brings exciting new talent into the world of cinema ????
Registrations are open for the event. https://t.co/20C5tccbsX
Once launched portal will be open for every aspiring talent… pic.twitter.com/L8W0282Evb
— Sri Venkateswara Creations (@SVC_official) May 20, 2025
