ప్రభాస్‌ను చూసి భయపడ్డానంటున్న సందీప్ రెడ్డి వంగా..!

Sandeep Reddy Vanga

సెన్సేషనల్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రం ‘స్పిరిట్’ కోసం రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సందీప్ రెడ్డి ఎలాంటి ఫీట్స్ చేయిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, తాజాగా ఓ టాక్ షోలో మాట్లాడిన సందీప్ రెడ్డి వంగా.. తాను ప్రభాస్‌ని చూసి భయపడిన విషయాన్ని రివీల్ చేశాడు.

తనకు బాహుబలి 2 చిత్ర ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే చాలా ఇష్టమని.. ఆ సినిమాలోని ఇంటర్వెల్‌లో ప్రభాస్ పర్ఫార్మెన్స్ చూసి అందరు కేకలు వేస్తూ అరవడం తాను ఇప్పటికీ మర్చిపోలేదని ఆయన అన్నారు. తాను అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలనా లేదా అనే సందేహంలో ఉన్నట్లు సందీప్ రెడ్డి తెలిపారు.

మొత్తానికి ప్రభాస్ పర్ఫార్మెన్స్, క్రేజీ చూసి సందీప్ రెడ్డి భయపడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి స్పిరిట్ సినిమాలో ఆయన ప్రభాస్‌ను ఎలా చూపెడతాడో వేచి చూడాలి

Exit mobile version