మోగ్లీ దూకుడు.. యూఎస్ ప్రీమియర్స్‌లో కలెక్షన్స్ జోరు..!

Mowgli 4

దర్శకుడు సందీప్ రాజ్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ చిత్రం ‘మోగ్లీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. అడవి నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామా చిత్రంలో రోషన్ కనకాల హీరోగా నటిస్తుండగా సాక్షి మదోల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బండి సరోజ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం నేడు(డిసెంబర్ 13) గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఇక ఈ సినిమాను ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ప్రీమియర్స్ వేయగా దానికి మంచి రెస్పాన్స్ లభించిందని మేకర్స్ తెలిపారు. నార్త్ అమెరికా ప్రీమియర్స్‌లో ఈ చిత్రం ఇప్పటికే 30K డాలర్ల వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో ఈ చిత్రం సాలిడ్ కలెక్షన్స్ రాబట్టడం ఖాయమని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version