ప్రస్తుతం ప్రపంచ సినిమా ఆడియెన్స్ ని తన వైపుకి తిప్పుకున్న అవైటెడ్ ఇండియన్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది భారీ చిత్రం “వారణాసి” అనే చెప్పాలి. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో చేస్తున్న ఈ సినిమా అనౌన్సమెంట్ తోనే ప్రకంపలు సృష్టించింది. ఇక ఈ సినిమా వరల్డ్ క్లాస్ హంగులతో తెలుగు సినిమా నుంచి మొట్ట మొదటి ఐమ్యాక్స్ వెర్షన్ లో తెరకెక్కించిన సినిమాగా రాబోతుంది.
ఇక ఈ సినిమాలో చిన్న షాట్ షూట్ చేసే అవకాశం ఇవ్వాలని జక్కన్నతో అవతార్ లాంటి సినిమాల క్రియేటర్ జేమ్స్ కేమెరూన్ చెప్పడం వైరల్ గా మారింది. తాజాగా అవతార్ ఫ్రాంచైజ్ లో వస్తున్న మూడో సినిమా “అవతార్: ఫైర్ అండ్ యాష్” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళితో ప్లాన్ చేసిన ఓ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూలో జక్కన్న, మహేష్ ల సినిమా సెట్స్ లోకి తీసుకెళ్లాలి అని అక్కడ కెమెరా ఆపరేట్ చేసి కొన్ని షాట్స్ తెరకెక్కించే అవకాశం కావాలని రాజమౌళితో చెప్పడం జరిగింది. దీనితో తన కామెంట్స్ వైరల్ గా మారాయి.