SALAAR: బిగ్గెస్ మాస్ ఫీస్ట్.. ‘సలార్’కి రెండేళ్లు.. పార్ట్ 2, ఈ రేర్ ఫీట్స్ సొంతం

Salaar

ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ మాస్ సినిమాల లిస్ట్ తీస్తే అందులో ఖచ్చితంగా కనిపించే సినిమా పేరు “సలార్” (Prabhas Salaar). రెబల్ స్టార్ ప్రభాస్ లాంటి కటౌట్ కి ప్రశాంత్ నీల్ లాంటి సాలిడ్ దర్శకుడు యాడ్ అయితే ఎలా ఉంటుందో సలార్ అనే సినిమాతో తాము చూపించారు. ఇప్పటికీ సలార్ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు రెండేళ్లు కావస్తుంది. దీనితో మరోసారి ఫ్యాన్స్ ‘సలార్’ మెమోరీస్ తిరగేస్తున్నారు. అయితే ఇండియన్ సినిమా దగ్గర సలార్ కి మాత్రమే సొంతమైన కొన్ని యునిక్ అంశాలు ఉన్నాయి.

థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఎక్కువ మాట్లాడుకున్న సినిమా..

జెనరల్ గా ఓ సినిమా ఎక్కాలంటే థియేటర్స్ నుంచే జరగాలి కానీ చాలా తక్కువ సినిమాలకి థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఆ ఫీట్ సాధ్యం అవుతుంది. ఇలాంటి లిస్ట్ లో ఎప్పుడో సినిమాలు ఉండేవి కానీ ఇప్పుడు ట్రెండీ యుగంలో మాత్రం ఆ ఫీట్ ఒక్క సలార్ (Salaar) కి సొంతం అయ్యింది అని చెప్పొచ్చు. ఈ సినిమా ఎప్పుడైతే ఓటిటిలోకి వచ్చిందో అక్కడ నుంచి పెద్ద ఎత్తున అంతా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. మెయిన్ గా డైలీ డోసేజ్ సలార్ అనే మాట ఇదే సినిమాతో మొదలైంది. అక్కడ నుంచి ఇతర సినిమాలు ఈ ట్రెండ్ ని ఫాలో అయ్యాయి.

Salaar OTT Records – ఓటిటిలో 500 రోజులకి పైగా ట్రెండింగ్

ఏ సినిమా అయినా ఓటిటి టాప్ ట్రెండింగ్ లో మహా అయితే కొన్ని వారాలు పాటు ట్రెండ్ లో ఉంటుంది గట్టిగా అయితే కొన్ని నెలలు అనుకోవచ్చు. కానీ ఏ ఇండియన్ సినిమాకి కూడా సొంతం కాని బిగ్గెస్ట్ రికార్డు ఓటిటిలో సలార్ కి ఉంది. జియో హాట్ స్టార్ లో హిందీలో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా ఇండియా వైడ్ ట్రెండింగ్ లిస్ట్ లో ఆల్ టైం టాప్ 10 లో ఏదొక స్థానంలో 500 రోజులకి పైగా ట్రెండ్ లోనే కొనసాగుతూ వచ్చింది. ఇదసలు వర్ణించలేని ఒక బిగ్గెస్ట్ రికార్డు..

Huge Hype on Salaar 2 – పార్ట్ 2 పై భారీ హైప్

ఈ సినిమా పార్ట్ 2 కోసం చాలా గట్టి హైప్ నెలకొంది. సలార్ మాస్ హిస్టీరియాలో మునిగిపోవాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ నుంచి రానున్న సీక్వెల్స్ లో దీనికే ఒకింత ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారని చెప్పినా ఎలాంటి ఆశ్చర్యం లేదు.

Exit mobile version