ప్రతి సంవత్సరం లాగే, ఈ సంక్రాంతి పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు పలు ఇంట్రెస్టింగ్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇక టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి సంక్రాంతి పోటి ఉత్కంఠగా మారింది. అయితే, ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’, ప్రభాస్ ‘ది రాజా సాబ్’, మాస్ రాజా రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రాలు కీలకంగా ఉండబోతున్నాయి.
కాగా, ఈ చిత్రాల్లో రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో తన రెగ్యులర్ రూటు మార్చి సరికొత్తగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథను పట్టుకొస్తున్నాడు. దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో రవితేజ ప్రేక్షకులకు సరికొత్త ట్రీట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే, ఈ సినిమా రిలీజ్ సందర్భంగా మేకర్స్ ఇప్పుడే ఓ నిర్ణయానికి వచ్చారట. ఈ సినిమాను ఎలాంటి టికెట్ రేట్లు పెంపు లేకుండా సాధారణ ధరలకే రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. దీంతో పండుగపూట ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు వీలుంటుందని వారు ఆలోచిస్తున్నారట.
మిగతా సినిమాలతో పోటీని తట్టుకుని నిలబడాలంటే, ఇలాంటి స్టెప్ తీసుకోవాల్సిందే. ఇక మిగతా సినిమాలతో పోలిస్టే, ఈ సినిమా ఒక అడుగు ముందుగా ఆలోచించడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై బజ్ క్రియేట్ అవుతుంది. ఇక మిగతా సినిమాలు కూడా పండుగ పూట ప్రేక్షకులను మెప్పించేందుకు ఎలాంటి ప్రమోషన్స్ చేస్తాయో చూడాలి.
