స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్షన్‌లో ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ సినిమాతో సమంత సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. ఇక ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా ప్రస్తుతం ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారట.
ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో సమంత చీరకట్టులో యాక్షన్ సీన్స్ చేస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా కోసం సమంత తీవ్రంగా కష్టపడుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, ఈ సినిమాను సమంత తన సొంత ప్రొడక్షన్ హౌజ్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై స్వయంగా ప్రొడ్యూస్ చేస్తోంది.
ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని మేకర్స్ భావిస్తు్న్నారు. మరి ‘మా ఇంటి బంగారం’ కోసం సమంత ఎలాంటి ఫీట్లు చేస్తుందో.. ఎలాంటి పాట్లు పడుతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
