సూర్య తెలుగు సినిమాపై సర్ప్రైజ్ చేసిన నాగవంశీ!

Suriya 46 1

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా ఇప్పుడు చేస్తున్న పలు చిత్రాల్లో మన టాలీవుడ్ లో కూడా చేస్తున్న సినిమా కూడా ఒకటి. దర్శకుడు వెంకీ అట్లూరితో చేస్తున్న ఈ సినిమా ఒక సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ మమిత బైజు సూర్య సరసన నటిస్తుంది. అయితే ఈ జంటపైనే నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ డీటెయిల్ అందించారు.

ఒక రకంగా ఇది ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో సూర్య తన ఏజ్ కి తగ్గ రోల్ నే చేస్తున్నారట. ఒక 40 ప్లస్ వ్యక్తి 20 ప్లస్ అమ్మాయితో లవ్ ట్రాక్ ఇందులో కనిపిస్తుందని నాగవంశీ అసలు విషయం రివీల్ చేశారు. అంతే కాకుండా ఇందులోనే బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయట. దీనితో ఈ కాన్సెప్ట్ విన్న ఫ్యాన్స్ ఒకింత ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. మరి ఆన్ స్క్రీన్ ఇదెలా ఉంటుందో చూడాల్సిందే.

Exit mobile version