సమీక్ష: ‘మార్క్’ – మెప్పించలేకపోయిన మ్యాక్స్ కాంబినేషన్

Mark

విడుదల తేదీ : జనవరి 01, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : కిచ్చా సుదీప్, నవీన్ చంద్ర, షైన్ టామ్ చాకో, విక్రాంత్, యోగిబాబు తదితరులు
దర్శకుడు : విజయ్ కార్తికేయ
నిర్మాతలు : సెంథిల్ త్యాగరాజు, అర్జున్ త్యాగరాజు
సంగీత దర్శకుడు : అజనీష్ బి లోకనాథ్
సినిమాటోగ్రాఫర్ : శేఖర్ చంద్ర
ఎడిటర్ : ఎస్ ఆర్ గణేష్ బాబు

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ చిత్రమే “మార్క్” (Mark) కన్నడలో గత వారమే విడుదల అయ్యిన ఈ సినిమా తెలుగులో ఈ వారం వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఒక సస్పెండెడ్ సూపరిండెంట్ పోలీస్ ఆఫీసర్ అజయ్ మార్కండేయ, మార్క్ గా గూండాల పాలిట యముడు. అయితే బీహార్ కి చెందిన పేరు మోసిన క్రిమినల్ భద్ర (నవీన్ చంద్ర) తన తమ్ముడు రుద్ర (విక్రాంత్ సంతోష్) తను ఫిక్స్ చేసిన పెళ్లి కాదని ప్రేమించిన అమ్మాయితో వెళ్ళిపోతాడు. అయితే మార్క్ ఉన్న పోలీస్ స్టేషన్ కి భారీగా డ్రగ్స్ తో ఇక మాఫియా దొరుకుతుంది. వీటితో పాటుగా సీఎం కావాలని కోరుకుంటున్న ఆది కేశవ (షైన్ టామ్ చాకో) వీటితో పాటుగా 18 మంది పిల్లలు ఆ ప్రాంతంలో కిడ్నాప్ కావడం పెద్ద సవాలుగా మారుతుంది. అందుకు కొన్ని గంటల సమయం మాత్రమే మిగికి ఉంటుంది. అసలు ఈ అన్నిటికీ ఏమన్నా కనెక్షన్లు ఉన్నాయా? ఉంటే అవి ఎలా? మార్క్, సస్పెన్సన్ లో ఉన్న తన గ్యాంగ్ ఆ 18 మంది పిల్లలని కాపాడగలిగాడా లేదా? వీరు సస్పెండ్ అవ్వడానికి కారణం ఎవరు అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.

ప్లస్ పాయింట్స్:

కిచ్చా సుదీప్ ఫ్యాన్స్ కి గత ఏడాది ఆరంభంలో ఇదే సినిమా దర్శకుడు విజయ్ కార్తికేయ మ్యాక్స్ అంటూ సాలిడ్ మాస్ ట్రీట్ ని అందించారు. మళ్లీ అదే కాంబినేషన్ లో వచ్చిన ఈ మార్క్ లో కూడా అప్పుడు చూసిన తరహా మాస్ మూమెంట్స్ కొన్ని కనిపిస్తాయి. మెయిన్ గా సుదీప్ పై యాక్షన్ బ్లాక్ లు అన్నీ మంచి స్టైలిష్ గా వర్క్ అయ్యాయి. తన ఫ్యాన్స్ కి ఇది ట్రీట్ అని చెప్పవచ్చు.

అలాగే ఫస్టాఫ్ కొంచెం బెటర్ గా ఉంది. కథనం లోపలకి వెళుతున్న కొద్దీ మరింత సంక్లిష్టంగా మారుతూ వెళ్లడంతో నెక్స్ట్ ఏం జరుగుతోంది అనే ఉత్సుకత ఫస్టాఫ్ లో ఏర్పడుతుంది. అంతే కాకుండా సుదీప్ తన రోల్ లో బాగా చేశారు. అలాగే నవీన్ చంద్ర ఉన్న కొంచెం సేపు కూడ సాలిడ్ పెర్ఫామెన్స్ అందించారు. తనకి తమ్ముడు పాత్రలో విక్రాంత్ కూడా బాగా చేసాడు. అలానే క్లైమాక్స్ పార్ట్ లో సుదీప్ పై సీన్ కొంచెం ఎమోషనల్ గా పర్వాలేదు అనిపిస్తుంది. తనతో పాటుగా ఇతర నటీనటులు బానే చేశారు.

మైనస్ పాయింట్స్:

ఓకే పర్లేదు అనే రేంజ్ ఫస్టాఫ్ నుంచి సెకండాఫ్ కి వచ్చాక అసలు స్ట్రగుల్ మొదలవుతుంది. నిజానికి దర్శకుడు రొటీన్ మాస్ సబ్జెక్ట్ తీసుకున్నప్పటికీ అందులో ఒక కాంప్లెక్సిటీని డిజైన్ చేసుకున్నారు. సో దీనికి అంతే బలమైన గ్రిప్పింగ్ కథనం అవసరం. కానీ ఇది సెకండాఫ్ కి వచ్చేసరికి కనిపించదు. ఇక్కడ నుంచి కథనం డల్ గా సాగుతూ పెద్దగా ఎగ్జైట్ చేయకుండానే వెళ్ళిపోతుంది.

మధ్యలో ఒకటీ రెండు ట్విస్ట్ లు ఉంటాయి కానీ వాటి తర్వాత కూడా కథనం బోర్ గా మారిపోతుంది. అయితే మ్యాక్స్ సినిమాకి ఇదే దర్శకుడు సుదీప్ ని ఎంతో స్టైలిష్ గా చూపించారు. కానీ ఈ సినిమాలో సరిగ్గా సుదీప్ మోహమే కనిపించదు. ఎంత సస్పెండ్ అయ్యిన పోలీస్ అయినా కూడా మరీ ఈ రేంజ్ లో చూపించాలా అనిపిస్తుంది.

అంతే కాకుండా ఫస్టాఫ్ లో అంత స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేసిన నవీన్ చంద్ర పాత్ర సెకండాఫ్ లో ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. తనతో పాటుగా షైన్ టామ్ చాకోది కూడా అంతే పరిస్థితి. ఇక వీటికి తోడు కొన్ని సీన్స్, డైలాగ్స్ సిల్లీ గా ఓవర్ డ్రమాటిక్ గా అనిపిస్తాయి.

ఇవి కన్నడ ఆడియెన్స్ కి అలాంటివి వర్కవుట్ అవ్వొచ్చేమో కానీ తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ అవ్వడం కష్టమే. అలానే కథనం కూడా ఒక టైం వచ్చేసరికి రొటీన్ అండ్ రెగ్యులర్ ఫార్మాట్ లోకే వెళ్ళిపోయింది. లోకేష్ కనగరాజ్ స్టైల్, ఇంకొన్ని సినిమాల ప్రభావం ఇందులో కనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. సెట్స్, ప్రొడక్షన్ డిజైన్ బాగా చేసుకున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతం యావరేజ్ గా ఉంది. కెమెరా వర్క్ బాగానే ఉంది. ఎడిటింగ్ సెకండాఫ్ లో బెటర్ గా చేయాల్సింది. మెయిన్ గా సాంగ్స్ తక్కువ నిడివిలో కట్ చేయాల్సింది.

ఇక దర్శకుడు విజయ్ కార్తికేయ విషయానికి వస్తే.. సుదీప్ తో మ్యాక్స్ అనే మాస్ హిట్ ఇచ్చిన తను ఇప్పుడు మార్క్ తో డిజప్పాయింట్ చేసారని చెప్పక తప్పదు. దీనిని కూడా రొటీన్ లైన్ గానే తీసుకున్నారు కానీ ఫస్టాఫ్ వరకు మంచి సంక్లిష్టంగా కథనాన్ని డిజైన్ చేసుకున్నారు. ఇది మెప్పిస్తుంది కానీ మిగతా సినిమా మాత్రం చాలా డల్ గా సాగదీసారు. యాక్షన్ పార్ట్ ని కొంచెం ఎక్కువ పెట్టుకున్నా మాస్ ఆడియెన్స్ కి దగ్గరయ్యేది. తను ముందు ప్లాన్ చేసుకున్న ఎపిసోడ్స్ కి ఇంకా ఎంగేజింగ్ కథనాన్ని సెకండాఫ్ లో రాసుకోవాల్సింది. దీనితో తన వర్క్ మాత్రం మ్యాక్స్ తో పోలిస్తే డిజప్పాయింట్మెంట్ నే మిగులుస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ ‘మార్క్’ (Mark) సినిమాలో కొన్ని యాక్షన్ బ్లాక్ లు, ఫస్టాఫ్ లు మాస్ ఆడియెన్స్, సుదీప్ ఫ్యాన్స్ కి పర్వాలేదు అనిపిస్తాయి. కానీ దర్శకుడు సెకండాఫ్ లో మాత్రం మూమెంటం మైంటైన్ చేయలేకపోయారు. గతంలో చేసిన మ్యాక్స్ కాంబినేషన్ పై కొంచెం ఐడియా ఉన్నవారు ఆయినా మార్క్ (Mark) తో డిజప్పాయింట్ అవుతారు. డల్ గా సాగే మూమెంట్స్ పొంతన లేని సన్నివేశాలతో వీక్ సెకండాఫ్ ఆడియెన్స్ ని నిరుత్సాహ పరుస్తాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Exit mobile version