పోకిరి, చిరుత వంటి ఎన్నో చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు ఆశిష్ విద్యార్థికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విలన్ పాత్రలతో దక్షిణాదిలో మంచి గుర్తింపు, భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తాజాగా ఆశిష్ విద్యార్థి, ఆయన భార్య రూపాలి రోడ్ ప్రమాదానికి గురయ్యారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికీ స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.
ఈ వార్తలపై తాజాగా ఆశిష్ విద్యార్థి స్పందిస్తూ, దీన్ని అనవసరంగా సెన్సేషనల్ చేయవద్దని మీడియాను కోరాడు. తాను, తన భార్య పూర్తిగా క్షేమంగా ఉన్నామని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. తమ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన భరోసా ఇచ్చాడు.
అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందో కూడా ఆశిష్ వివరించాడు. తాము రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన ఒక బైకర్ ఢీకొట్టాడని చెప్పాడు. ఈ ఘటన గువాహటిలో జరిగిందని వెల్లడించాడు.
