శర్వానంద్ ‘భోగి’ కొత్త షెడ్యూల్ షురూ.. సంపత్ నంది ప్లాన్ అదిరింది..!

Sharwanand

చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) ప్రస్తుతం తన లేటెస్ట్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ని సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేశాడు. ఇక ఈ సినిమా తర్వాత మరో చిత్రం ‘బైకర్’ను కూడా రిలీజ్‌కు సిద్ధం చేశాడు. అయితే, తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌గా దర్శకుడు సంపత్ నంది డైరెక్షన్‌లో ‘భోగి’ అనే పీరియాడిక్ సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ జనవరి 5న హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

ఈ కొత్త షెడ్యూల్‌లో శర్వానంద్ (Sharwanand) సహా పలువురు ఆర్టిస్టులపై టాకీ పోర్షన్ షూట్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో శర్వానంద్ మోస్ట్ రగ్గెడ్ లుక్‌లో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడు. ఆయన ఇప్పటివరకు కనిపించని లుక్‌లో ఈ సినిమాలో కనిపిస్తాడని చిత్ర యూనిట్ చెబుతోంది.

దీంతో ఈ సినిమాలో శర్వానంద్ (Sharwanand) ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధా మోహన్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Exit mobile version