మెగా, విక్టరీ గ్రాండ్ ఈవెంట్.. ఆ ముగ్గురు స్పీచ్ పైనే అందరి కళ్ళు! ఒకరు ఇంకా స్పెషల్

Mana Shankara Vara Prasad Garu

ఈ సంక్రాంతి బరిలో రిలీజ్ కి రాబోతున్న అవైటెడ్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన అవైటెడ్ ఎంటర్టైనర్ చిత్రమే మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Vara Prasad Garu). మంచి హైప్ ని ఫ్యామిలీ ఆడియెన్స్ లో అందుకున్న ఈ సినిమా తాలూకా గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నేడు జరగనున్న సంగతి తెలిసిందే.

ఇక నేడు ఈ సినిమా తాలూకా గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనున్న సంగతి తెలిసిందే. మరి ఈ ఈవెంట్ లో ఓ ముగ్గురు స్పీచ్ కోసం అంతా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. మొదటిగా మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత తన సినిమా ప్రీరిలీజ్ కి హాజరు అవుతుండగా తన స్పీచ్ పట్ల మంచి ఆసక్తి నెలకొంది. ఇక నెక్స్ట్ వెంకీ మామ కోసమే చెప్పాలి.

వెంకీ మామ ఈ సినిమా నటించడం మంచి స్పెషల్ కాగా తన స్పీచ్ పట్ల కూడా మంచి ఆసక్తి నెలకొంది. ఇక ఫైనల్ గా మరో వ్యక్తి ఏం పంచుకుంటారా అనేది కూడా ఇంట్రెస్ట్ గా మారింది. మరి అది ఎవరో కాదు హీరోయిన్ నయనతార అనే చెప్పాలి. నయన్ పెద్దగా ఎలాంటి ఈవెంట్ కి హాజరైంది ఉండదు. అలాంటిది ఈ సినిమా ప్రమోషన్స్ చేయడం, ప్రీ రిలీజ్ కి కూడా వస్తుండడంతో ఆమె విషయంలో తమిళ ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు.

Exit mobile version