‘టాక్సిక్’ నుంచి అసలు బ్లాస్ట్ కి రంగం సిద్ధం!

Toxic

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ఇప్పుడు చేస్తున్న అవైటెడ్ భారీ చిత్రమే “టాక్సిక్”(Toxic). దర్శకురాలు జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ గ్యాంగ్ స్టర్ డ్రామాలో అనేకమంది స్టార్ హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు. ఇలా వారిపై ఒకో అప్డేట్ ని అందిస్తూ మేకర్స్ వచ్చారు. ఇక లేటెస్ట్ గా అంతా ఎదురు చూస్తున్న అసలు సిసలు బ్లాస్ట్ యష్ బర్త్ డే కానుక ట్రీట్ ని అందించేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు.

రేపు జనవరి 8న యష్ పుట్టినరోజు కానుకగా మేకర్స్ బిగ్ అప్డేట్ ని రివీల్ చేస్తున్నట్టు ఓ పోస్టర్ తో మరింత హైప్ పెంచారు. మరి ఇందులో యష్ లుక్ పూర్తిగా రివీల్ చేయలేదు కానీ రేపు ఉదయం 10 గంటల 10 నిమిషాలకి ఆ అప్డేట్ ఏంటో వదులుతున్నట్టు ప్రామిస్ చేశారు. మరి గతంలో యష్ బర్త్ డే కానుకగా కేజీయఫ్ చిత్రాల నుంచి సెన్సేషనల్ ట్రీట్ లు వచ్చాయి. మరి వాటిని రేపు వచ్చేది బీట్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

Exit mobile version