మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu) సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేడుక ఘనంగా జరిగింది. ఇక ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా మరో సాలిడ్ ట్రీట్ ఇచ్చారు.
‘హుక్ స్టెప్’ అంటూ సాగే మంచి డ్యాన్స్ నెంబర్‌ను వారు రిలీజ్ చేశారు. అల్ట్రా కూల్ లుక్స్‌తో మెగాస్టార్ నుంచి కొన్ని అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ మనకు ఈ పాటలో చూపెట్టారు. అంతేగాక, చిరు ఎవర్‌గ్రీన్ హుక్ స్టెప్స్ కూడా మనకు ఇందులో చూపెట్టారు. దీంతో మెగా ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు. తమ అభిమాన హీరో నుంచి ఇలాంటి డ్యాన్స్ నెంబర్ వచ్చి చాలా రోజులు కావడంతో వారు ఈ సాంగ్‌ను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. అనిల్ రావిపూడి ఈ చిత్రంతో తన సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేసేందుకు సిద్ధమవుతుండగా విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
