తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర మాత్రమే కాకుండా టోటల్ ఇండియన్ సినిమా దగ్గర డాన్స్ అంటే కొత్త ట్రెండ్ ని సెట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరో మెగాస్టార్ చిరంజీవి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక రకంగా తనకి ఈ స్థాయి క్రేజ్ వచ్చింది అంటే అది తన మెరుపు వేగపు డాన్స్ మూమెంట్స్, గ్రేస్ తో కూడిన చిన్న స్టెప్స్ వలనే అని చెప్పవచ్చు. అలాంటి చిరంజీవి అంటే ఎవరో ఇప్పుడు తరానికి తన 71 ఏళ్ల వయసులో కూడా చూపిస్తున్నారు.
తన లేటెస్ట్ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Vara Prasad Garu) నుంచి వచ్చిన హుక్ స్టెప్ సాంగ్ దెబ్బతో సోషల్ మీడియా తగలబడిపోతుంది. ఏ హీరో అభిమాని అయినా టోటల్ తెలుగు సినిమా దర్శకులు నిర్మాతలు మెగాస్టార్ కోసమే ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆ రేంజ్ లో తన డాన్స్, స్టైలింగ్ అండ్ ఎనర్జీతో మెగాస్టార్ షేక్ చేస్తున్నారు. అంతే కాకుండా థియేటర్స్ లో మెగాస్టార్ సీనియర్ ఫ్యాన్స్ అందరికీ గ్రాండ్ ట్రీట్ అని కూడా అంటున్నారు.
