ఓటిటి సమీక్ష: ‘కానిస్టేబుల్ కనకం’ – సీజన్ 2: తెలుగు థ్రిల్లర్ సిరీస్ ఈటీవీ విన్ లో

Constable Kanakam S2

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జనవరి 8, 2026
స్ట్రీమింగ్‌ వేదిక :  ఈటీవీ విన్
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : వర్ష బొల్లమ్మ, మేఘ లేఖ, శ్రీనివాస్ అవసరాల, సుచిత్ర ఆనందన్, ప్రేమ్ సాగర్, రమణ భార్గవ్, జ్వాలా కోటి, రాకేందు మౌళి తదితరులు
దర్శకత్వం : ప్రశాంత్ కుమార్ దిమ్మల
నిర్మాతలు : కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్
సినిమాటోగ్రఫీ : శ్రీరామ్ ముక్కపాటి
సంగీతం : సురేష్ బొబ్బిలి
ఎడిటర్ : మాధవ్ కుమార్ గుల్లపల్లి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ఈ వారం ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చిన పలు సిరీస్ అండ్ సినిమాల లిస్ట్ లో మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ నుంచి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం సీజన్ 2 (Constable Kanakam S2) కూడా ఒకటి. మరి ఈ ఇదెలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

(Constable Kanakam) కథ:

రేపల్లె, అడవిగుట్టలో కనిపించకుండా పోయిన మిస్సైన మహిళా కేసులో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి (వర్ష బొల్లమ్మ) ని ఎవరైతే తన తోటి ఆఫీసర్స్ ముందు అవమానించారో వాళ్ళే ఆమెని గౌరవిస్తారు. అయినప్పటికీ ఆమెకి తన స్నేహితురాలు చంద్రిక (మేఘ లేఖ) మిస్సింగ్ సస్పెన్స్ మాత్రం ఆమెని వెంటాడుతుంది. దీనితో ఆమె తన స్నేహితురాలిని కనుక్కోడానికి ఏం చేసింది? ఈ ప్రాసెస్ లో ఆమె తెలుసుకున్న నిజాలు ఏంటి? చివరికి ఆమె తనని కనుక్కుందా లేదా? ఈ అంతటి వెనుక ఉన్నది ఎవరు అనేది తెలియాలి అంటే ఈ సీజన్ చూడాలి.

ప్లస్ పాయింట్స్:

గత సీజన్లో కొన్ని అంశాలు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కనిపించలేదు. మెయిన్ గా ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కి కావాల్సిన ఎలిమెంట్స్ ని మిస్ చేశారు. కానీ మేకర్స్ వాటిని ఈసారి సీజన్ లో మాత్రం కరెక్ట్ చేసుకున్నారని చెప్పాలి. దాదాపు కథనాన్ని ఒక డీసెంట్ మ్యానర్ లో నడిపించిన తీరు ఇందులో మెప్పిస్తుంది. అంతే కాకుండా ఈసారి థ్రిల్ మూమెంట్స్ తో కథనం అలా ముందుకి తీసుకువెళుతూనే ఉంటుంది.

చాలా వరకు సన్నివేశాలు ఎలాంటి ల్యాగ్ లేకుండా నీట్ గా కొనసాగుతూ వెళుతుంటాయి. అలాగే కొన్ని ట్విస్ట్ లు, ఇన్వెస్టిగేషన్ సీన్స్ బాగున్నాయి. అంతేకాకుండా ఈసారి సీజన్ లో ఇంప్రెస్ చేసే మరో అంశం. చంద్రిక బ్యాక్ స్టోరీ అని చెప్పాలి. ఇందులో పూర్తిగా కొత్త టర్న్ ని తీసుకున్నారు. ఇది ఆ పాత్రకి మరింత బలం చేకూర్చింది. అలాగే ఆ రోల్ కి తగ్గట్టుగానే మేఘ లేఖ అందులో బాగా చేసింది.

ఇక మెయిన్ నటి వర్ష బొల్లమ్మ గత సీజన్ ఏ విధంగా మెప్పించిందో ఇందులో కూడా అదే రీతి పెర్ఫామెన్స్ ని చేసింది. ఇక వీరితో పాటుగా ఈ సీజన్ లో సర్ప్రైజ్ ప్యాక్ మాత్రం సుచిత్ర ఆనందన్ అని చెప్పాలి. ఆమెకి ఇందులో మరింత స్కోప్ కనిపించగా తన రోల్ ని కూడా బాగా హ్యాండిల్ చేశారు. అలాగే ఈ సారి సీజన్ లో థ్రిల్ మూమెంట్స్ తో పాటుగా ఎమోషనల్ పార్ట్ కూడా ఇందులో ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్:

ఈ థ్రిల్లర్ సిరీస్ నుంచి ఏదన్నా కొత్తదైన ఎలిమెంట్ ని ఆశించేవారికి అయితే ఈ సిరీస్ కాన్సెప్ట్ అంత ఎంగేజ్ చేయకపోవచ్చు. ఇందులో కనిపించే కోర్ ఐడియా ఏమి కొత్తది కాదు. సో ఒక డిఫరెంట్ అండ్ కొత్త కాన్సెప్ట్ తో కూడిన థ్రిల్లర్ గా ఆశిస్తే కొంచెం నిరాశ చెందుతారు.

అలాగే ఈ సీజన్ కేవలం రెండే గంటల్లో అయ్యిపోతుంది. సో త్వరగానే ఈ సీజన్ అయిపోయిందా అనిపిస్తుంది. అలాగే శ్రీనివాస్ అవసరాల రోల్ కి ఈ సీజన్ లో ఇంపార్టెన్స్ అంతగా ఇవ్వలేదు అనిపిస్తుంది. దీనికోసం సీజన్ 3 కోసం వేచి చూడక తప్పదు. అలాగే ఇంకొన్ని సీన్స్ ని బెటర్ గా ప్లాన్ చేసుకోవాలింది.

సాంకేతిక వర్గం:

ఈ సీజన్ లో నిర్మాణ విలువలు బాగున్నాయి. గత సీజన్ కంటే బెటర్ గా అన్ని కోణాల్లో బెటర్ చేసే ప్రయత్నం మేకర్స్ చేశారు. ఈ మధ్య కాలంలో తెలుగు నుంచి టెక్నికల్ గా ఇంప్రెస్ చేసిన మరో సిరీస్ గా దీనిని చెప్పొచ్చు. సురేష్ బొబ్బిలి సంగీతం బాగుంది. సాయిరాం మొక్కపాటి కెమెరా వర్క్ తో మంచి విజువల్స్ అందించారు. మాధవ్ కుమార్ ఎడిటింగ్ కూడా నీట్ గా ఉంది.

ఇక దర్శకుడు కుమార్ దిమ్మల విషయానికి వస్తే.. తన వర్క్ సెకండ్ సీజన్ కి చాలా బెటర్ గా ఉంది. కథనాన్ని గతంలో కంటే బెటర్ గా నడిపించారు. అలాగే ఎమోషన్స్ ని కూడా బాగా ప్రెజెంట్ చేశారు. అక్కడక్కడా కొన్ని చోట్ల సింపుల్ గానే ఉంది కానీ ఓవరాల్ గా మంచి ఇంపాక్ట్ తన వర్క్ చూపిస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘కానిస్టేబుల్ కనకం సీజన్ 2’ (Constable Kanakam S2) . గత సీజన్ తో పోలిస్తే బెటర్ వెర్షన్ అని చెప్పొచ్చు. కేవలం కథనం పరంగానే కాకుండా నటీనటుల పెర్ఫామెన్స్ లు కూడా ఇందులో ఇంప్రెస్ చేసే విధంగా ఉన్నాయి. కాకపోతే ఇందులో ప్లాట్ రొటీన్ గానే ఉంటుంది కానీ ట్రీట్మెంట్ మాత్రం థ్రిల్లర్ లవర్స్ ని మెప్పిస్తుంది. సో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ని ఈటీవీ విన్ లో చూడొచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Exit mobile version