మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా సంక్రాంతికి స్పెషల్ గా రాబోతుంది. ఈ రోజు నైట్ ప్రీమియర్స్ పడబోతున్నాయి. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రాబోతున్నాయి. ఐతే, ఇప్పుడు ఈ సినిమాలో వచ్చే క్లైమాక్స్ సీక్వెన్స్ పై ఓ అప్ డేట్ వినిపిస్తోంది. నయనతార – ఆమెకు సంబంధించిన ఇతర ఫ్యామిలీ మెంబర్స్ ను విలన్స్ టార్గెట్ చేస్తారట, వేరు వేరు ప్లేస్ ల్లో ఉన్న వారిని ఓ సమయంలో సేవ్ చేయాల్సిన పరిస్థితి రావడం.. సడెన్ గా అదే టైమ్ లో వెంకీ ఎంట్రీ ఇవ్వడం, ఇద్దరు హీరోలు చేరే ప్లేస్ కి వెళ్లి నయనతారను – ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ను సేవ్ చేస్తారట.
మరి ఫ్యాన్స్ ను ఈ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ మూవీ కథ తనకు బాగా నచ్చిందని చెప్పారు. సంక్రాంతికి మెయిన్ స్పెషల్ గా రాబోతున్న ఈ సినిమా సూపర్ హిట్ కావాలని చిరు అభిమానులు ఆశిస్తున్నారు.
