రిపోర్ట్ : ప్రీమియర్ షోల ద్వారా ఎంత వచ్చాయంటే ?

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా “మన శంకర వరప్రసాద్ గారు”(Mana Shankara Vara Prasad Garu). సంక్రాంతికి స్పెషల్ గా ఈ సినిమా విడుదలైంది. కాగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో నిన్న రాత్రి ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్ షోలు పడ్డాయి. కాగా కేవలం ప్రీమియర్‌ల నుండే రూ. 25 కోట్లకు పైగా వసూలు చేసి, అద్భుతమైన ఓపెనింగ్స్ ను ఈ సినిమా నమోదు చేసినట్లు తాజా అప్ డేట్స్ వినిపిస్తున్నాయి. ఇంతటి ఘనమైన ప్రారంభంతో మొదలైన ఈ చిత్రం, మొదటి రోజు కూడా బలమైన వసూళ్లను నమోదు చేస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు.

ఎలాగూ సంక్రాంతి సీజన్ కాబట్టి, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం తన జోరును మరింత కొనసాగించడానికి ఈ పాజిటివ్ టాక్ బాగా ప్లస్ కానుంది. మొత్తానికి అనిల్ రావిపూడి పండుగ వినోదాత్మక చిత్రాన్ని అందించారు, ఈ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ లో నయనతార కథానాయికగా నటించింది. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. మొత్తమ్మీద సంక్రాంతికి మెయిన్ స్పెషల్ గా వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి కామెడీ టైమింగ్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి.

Exit mobile version