Pushpa 2 in Japan: జపాన్లో ‘పుష్ప’ రాజ్ కి ఘన స్వాగతం..!

Pushpa 2

ఇండియన్ సినిమా నుంచి వచ్చిన బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప 2 కూడా ఒకటి. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకుంది. అయితే ఈ సినిమాలో జపాన్ కాన్సెప్ట్ కూడా ఉంటుందని తెలిసిందే.

మరి ఫైనల్ గా ఈ సినిమాని జపాన్ దేశస్తులని అలరించేందుకు సిద్ధం అయ్యింది. ఈ జనవరి 16న గ్రాండ్ రిలీజ్ కి వెళుతుండగా అల్లు అర్జున్ అక్కడ తన సినిమా ప్రమోట్ చేయడానికి వెళ్ళాడు. అయితే తనకి అక్కడ ఆడియెన్స్ నుంచి ఘన స్వాగతం దక్కిన విజువల్స్ వైరల్ గా మారాయి. మరి అక్కడి ఆడియెన్స్ అల్లు అర్జున్ పట్ల చూపిస్తున్న ఎగ్జైట్మెంట్ చూసి ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా అక్కడ ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version