రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ కథానాయకులుగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రామ్ భజరంగ్’. సి.హెచ్. సుధీర్ రాజు దర్శకత్వంలో సన్ రైజ్ ఎంటర్‌టైన్‌మెంట్, రవి ఆర్ట్స్ బయ్యర్స్ పతాకాలపై స్వాతి సుధీర్, డాక్టర్ రవి బాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్ర గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ ఘనంగా విడుదల చేసింది. ఇది రాజ్ తరుణ్ కెరీర్‌లో 25వ చిత్రం కావడం విశేషం.
1980 నాటి నేపథ్యంలో, యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎలిమెంట్స్ మేళవింపుగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘గదర్ 2’ ఫేమ్ సిమ్రత్ కౌర్, సాత్నా టైటస్, మానస రాధాకృష్ణన్ కథానాయికలుగా నటిస్తుండగా, స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కేరళలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఈ చిత్రంలో తాను సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నానని రాజ్ తరుణ్ పేర్కొనగా, సినిమాను అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించారని సందీప్ మాధవ్ తెలిపారు.
ఈ సినిమాలో తాను పోషించిన నెగిటివ్ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని నటుడు వెంకట్ పేర్కొన్నారు. మంచి మాస్ కథాంశంతో వస్తున్న ఈ చిత్రాన్ని 2026లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే టీజర్, ట్రైలర్ విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
