నైజాంలోనూ మెగా సినిమా కలెక్షన్ల సంచలనం !

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Vara Prasad Garu) సినిమా కేవలం 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 261 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇప్పుడు రూ. 300 కోట్ల మైలురాయిని చేరుకునే దిశగా దూసుకుపోతోంది. అటు నైజాంలో కూడా రోజురోజుకు ఈ చిత్రం అనూహ్యంగా మంచి కలెక్షన్స్ ను రాబడుతూనే ఉంది. లేటెస్ట్ గా ఈ సినిమా నైజాం వసూళ్ల సంబంధించిన అఫీషియల్ కలెక్షన్ల డీటెయిల్స్ బయటకు వచ్చాయి.

తాజా కలెక్షన్ల వివరాల ప్రకారం, ఈ చిత్రం 6వ రోజు కూడా రూ. 4.6 కోట్ల షేర్‌ను రాబట్టింది. మొత్తం ఆరు రోజులకు గానూ ఈ సినిమా నైజాం షేర్‌ జీఎస్టీ పోగా, రూ. 29.5 కోట్లకు చేరింది. నిజంగా ఇవి భారీ కలెక్షన్లే. రాబోయే వారంలో ఈ చిత్రానికి పెద్దగా పోటీ కూడా లేదు. కాబట్టి, రాబోయే రోజుల్లో ఈ సినిమా నైజాంలో మరిన్ని వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఎలాగూ ఈ సినిమాకి ఇంకా ప్రమోషన్స్ ను కూడా బలంగా చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ సినిమాకు మరింత ప్రచారం కల్పించనున్నాయి.

మొత్తానికి ఈ సినిమాలో చిరంజీవి ట్రేడ్‌మార్క్ కామెడీ టైమింగ్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాలు, పాటలు మరియు మాస్ సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఈ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ లో నయనతార కథానాయికగా నటించింది. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.

Exit mobile version