నేషనల్ క్రష్ రష్మిక మందన్న, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కొద్ది నెలల క్రితమే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అప్పటి నుంచే వీరి పెళ్లి ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగనుందనే ప్రచారం బలంగా సాగుతోంది. అయితే ఈ విషయంపై ఇద్దరూ ఇప్పటివరకు మౌనం పాటిస్తున్నారు.
ఇటీవల ఓ సందర్భంలో రష్మిక తన పెళ్లి వార్తలపై స్పందించింది. “ఈ రూమర్స్ మొదలై నాలుగేళ్లు అవుతోంది. అప్పటి నుంచి అందరూ అదే ప్రశ్న అడుగుతున్నారు. కానీ నిజం ఏమిటంటే, మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రమే మేము మాట్లాడతాం” అని ఆమె స్పష్టం చేసింది. సరైన సమయం వచ్చినప్పుడే తాము ఈ విషయాన్ని వెల్లడిస్తామని ఆమె చెప్పింది.
దీంతో రష్మిక-విజయ్‌ల పెళ్లిపై వస్తున్న వార్తలు మరోసారి రూమర్లుగానే మిగిలాయి. వాటిపై క్లారిటీ ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
