రెహమాన్ ని ఎక్స్ పోజ్ చేసిన వర్మ.. ఆస్కార్ కి విలువ లేకుండా పోయిందా?

RGV

గత కొన్ని రోజులు నుంచి సోషల్ మీడియాలో ఆస్కార్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ (AR Rahman) కోసమే చర్చ నడుస్తుంది. ఇండియా వైడ్ గా కూడా రెహమాన్ చేసిన ఓ స్టేట్మెంట్ నుంచి ఇప్పుడు తన వర్క్ వరకు చాలానే వినిపిస్తూ వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఏ ఆర్ రెహమాన్ పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన పలు కామెంట్స్ పాత ఇంటర్వ్యూస్ నుంచి బయటకొచ్చి వైరల్ గా మారుతున్నాయి. వీటిలో రెహమాన్ అందుకున్న ప్రపంచ ప్రఖ్యాత అవార్డు ఆస్కార్ వెనుక ఉన్న ఓ షాకింగ్ నిజాన్ని ఎక్స్ పోజ్ చేయడం అనేది విన్న వారికి మతి పోగొడుతుంది.

RGV exposes AR Rahman – రెహమాన్ ని ఎక్స్ పోజ్ చేసిన వర్మ..

స్లమ్ డాగ్ మిలీనియర్ అనే సినిమాలో ‘జై హో’ సాంగ్ కి రెహమాన్ ఆస్కార్ అందుకొని దేశానికి గర్వకారణంగా నిలిచారు. కానీ అసలు ఆ సాంగ్ రెహమాన్ కంపోజ్ చేసిందే కాదని రామ్ గోపాల్ వర్మ చెప్పడం జరిగింది.

Who is Jai Ho original creator – జై హో సాంగ్ ఒరిజినల్ క్రియేటర్ ఎవరు?

పాపులర్ సింగర్, సంగీత దర్శకుడు సుక్వీందర్ సింగ్ ఒరిజినల్ గా మరో సినిమా కోసం కంపోజ్ చేసిందట. 2009లో సల్మాన్ ఖాన్ నటించిన సినిమా యువరాజ్ కోసం ఆ సినిమా నిర్మాత ఏ ఆర్ రెహమాన్ ని కంపోజర్ గా పెట్టుకుంటే అప్పుడు రెహమాన్ ఎంతకీ పాటలు ఇవ్వకపోవడంతో అసలేం జరుగుతుంది అని అడిగినప్పుడు సుక్వీందర్ కంపోజ్ చేసిన సాంగ్ ని వినిపించారట.

దీనితో ఆ సాంగ్ బాగుందని చెప్పగా ఈ సాంగ్ ని వాడుకుందామని నిర్మాతకి చెప్పేసరికి ఆయనకి పట్టరాని కోపం వచ్చిందట. దీనితో సుక్వీందర్ ఇచ్చిన సాంగ్ నే పెట్టుకోవాలి అంటే నీకెందుకు 3 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తానని రెహమాన్ కి చెప్పేశారని వర్మ తెలిపారు. అయితే తర్వాత అదే సాంగ్ ని ఫినిష్ చేసి తనకి మెయిల్ చెయ్యమని రెహమాన్ చెప్పారని అలా స్లమ్ డాగ్ మిలీనియర్ లోకి వచ్చిన పాటనే ‘జై హో’ అంటూ అసలు విషయం రివీల్ చేశారు. దీనితో ఈ షాకింగ్ ట్విస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరి రెహమాన్ ఆస్కార్ కి ఏం విలువ ఉన్నట్టు?

రామ్ గోపాల్ వర్మ అదే ఇంటర్వ్యూలో రెహమాన్, సదరు నిర్మాతతో తన పాటల కోసం కాదు నా పేరు కోసమే మీరు డబ్బులు ఇస్తున్నారని చెప్పినట్టు తెలిపారు. సో తాను కంపోజ్ చెయ్యని సాంగ్ కి వచ్చిన ఆస్కార్ అవార్డు తనదే అన్నట్టు చెప్పుకున్నట్టు అయ్యింది. ఇక దీనికేం విలువ ఉన్నట్టు అని సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

ఈ కాంట్రవర్సీపై సుక్వీందర్ గతంలో క్లారిటీ!

ఆర్జీవీ తనకి సుక్వీందర్ ఇదే చెప్పాడు అంటూ అప్పుడు ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే దీనిపై సుక్వీందర్ కూడా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను కేవలం పాట మాత్రమే పాడాను అని రెహమాన్ నే ఆ సాంగ్ ని కంపోజ్ చేసినట్టు తెలిపారు. సో ఆ సాంగ్ రెహమాన్ దే అని తాను చెప్పారు. కానీ అదే ఆర్జీవీ ఆ సాంగ్ కోసం సుక్వీందర్ కి రెహమాన్ 5 లక్షలు ఇచ్చి తన స్లమ్ డాగ్ మిలీనియర్ కి మార్చుకున్నట్టూ తెలిపారు. మరి ఎవరి వెర్షన్ లో ఎంతవరకు నిజం ఉంది అనేది బయటకి రావాల్సి ఉంది.

Exit mobile version