ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా చూసే ఆస్కార్(Oscars) అవార్డులకు సంబంధించి 2026 నామినేషన్స్‌ను తాజాగా ప్రకటించారు. వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అయి ప్రేక్షకుల మన్ననలు పొందిన సినిమాలను ఎప్పటిలాగే ఈసారి కూడా పలు విభాగాల్లో నామినేట్ చేశారు. అయితే, 2026 ఆస్కార్ నామినేషన్స్‌లో మునుపెన్నడూ లేని విధంగా ఓ సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది.
2025 ఏప్రిల్‌లో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమాను ర్యాన్ కూగ్లర్ డైరెక్ట్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమాలో మైఖేల్ బి. జోర్డాన్ హీరోగా డ్యుయల్ రోల్‌లో నటించారు. ఇక ఈ సినిమాకు వరల్డ్‌వైడ్‌గా సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. అయితే, ఇప్పుడు ఆస్కార్ 2026 నామినేషన్స్‌లో ఈ చిత్రం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 16 విభాగాల్లో నామినేట్ అయింది.
ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, మేకప్ అండ్ హెయిర్ స్టైల్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ కాస్టింగ్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ సౌండ్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో ‘సిన్నర్స్’(Sinners) చిత్రం నామినేట్ అయ్యింది. ఇలా ఆస్కార్ నామినేషన్స్ చరిత్రలో ఇన్ని విభాగాల్లో నామినేట్ అయ్యి ‘సిన్నర్స్’ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
