మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’(Peddi) ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ రూరల్ సోర్ట్స్ డ్రామా మూవీలో రామ్ చరణ్ మాస్ లుక్‌తో ఇరగదీసేందుకు రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘చికిరి చికిరి’కి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే, ఇప్పుడు ఈ రిలీజ్ విషయంపై సినీ సర్కిల్స్‌లో సరికొత్త గందరగోళం నెలకొంది. ‘పెద్ది’ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. కానీ, మార్చి 19న బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ధురంధర్’ సీక్వెల్ చిత్రం ‘ధురంధర్ 2’.. రాక్‌స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఈ చిత్రాలపై నార్త్ బెల్ట్‌లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాల కోసం థియేటర్లను బ్లాక్ చేసే పనిలో పడ్డారు.
దీంతో ‘పెద్ది’ రిలీజ్‌ను వాయిదా వేసుకుని తర్వాత వస్తే, ఈ చిత్రానికి లాంగ్ రన్‌తో పాటు ఎక్కువ కలెక్షన్స్ వచ్చే పరిస్థితి ఉందంటూ పలువురు నార్త్ డిస్ట్రిబ్యూటర్లు సూచిస్తున్నారట. మరి నిజంగానే వారి సూచనలతో పెద్ది చిత్రం మార్చి రిలీజ్‌ను వాయిదా వేస్తుందా.. లేక చెప్పిన తేదీనే వచ్చేస్తుందా..? అనే గందరగోళం సినీ సర్కిల్స్‌లో నెలకొంది. మరి ఈ విషయంపై పెద్ది మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
