ప్రేమికుల రోజున స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్న క్యూట్ ‘లవ్ స్టోరి’

Love-Story

అక్కినేని నాగచైతన్య కెరీర్‌లో ‘లవ్ స్టోరీ'(Love Story) ఒక సూపర్ హిట్ చిత్రంగా నిలిచిపోయింది. ఈ చిత్రంలో తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి చెందిన జానపద కళాకారుడిగా చైతన్య తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు. దర్శకుడు శేఖర్ కమ్ముల మార్క్ భావోద్వేగాలు, సున్నితమైన కథాంశం ఈ సినిమాను ఒక క్లాసిక్‌గా మార్చాయి.

సాయి పల్లవి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించగా, వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కులమతాలకు అతీతమైన ప్రేమను వెండితెరపై ఆవిష్కరించింది. ‘నీ చిత్రం చూసి’, ‘సారంగ దరియా’ వంటి హిట్‌ సాంగ్స్ ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చాయి. గ్రామీణ తెలంగాణ నేపథ్యం, శేఖర్ కమ్ముల టేకింగ్ ప్రేక్షకులను సినిమాతో మమేకం అయ్యేలా చేశాయి.

ఇక ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ మ్యాజికల్ మూవీని థియేటర్లలో రీ-రిలీజ్ చేస్తున్నారు. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం వెండితెరపై మరోసారి ప్రేమ జల్లు కురిపించేందుకు సిద్ధమైంది.

Exit mobile version