ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నుంచి రాబోతున్న అవైటెడ్ చిత్రమే “విశ్వంభర”(Vishwambhara). యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ భారీ ఫాంటసీ సినిమా పక్కా ప్లానింగ్ తో ఇప్పుడు రాబోతుంది. ఇక దీనికి ముందు వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. రీజనల్ గా బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి మెగాస్టార్ స్టామినా మరోసారి ప్రూవ్ చేసింది.
అయితే మన సీనియర్ హీరోస్ అందరికీ ఇప్పుడు ట్రెండ్ టేస్ట్ కి తగ్గట్టుగా అప్డేట్ అవుతూ వస్తున్నారు. అయితే ఇందులో కొన్ని వింటేజ్ మూమెంట్స్ కి మెరుగులు దిద్ది కూడా కొన్ని వస్తున్నాయి. ఇలా మన స్టార్స్ ని ఎలివేట్ చేయడంలో స్పెషల్ టైటిల్ కార్డ్స్ సినిమాల్లో ఫ్యాన్స్ ని ఇతర హీరోల అభిమానులలో కూడా చర్చకి దారి తీస్తున్నాయి.
ఇది ఎప్పుడు నుంచో ఉంది కానీ ఈ కొన్నేళ్లలో అయితే కోలీవుడ్ చిత్రం ‘లియో’తో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. దీనితో తమ స్టార్ హీరోస్ కి కూడా పక్కాగా అలాంటి టైటిల్ కార్డ్స్ కావాలని ఫ్యాన్స్ లో కోరికలు కూడా పెరిగాయి. అయితే లియో తర్వాత దానిని మ్యాచ్ చేసే రేంజ్ టైటిల్ కార్డ్స్ అటు తమిళ్, తెలుగులో కూడా పడలేదు. అంతెందుకు విజయ్ నుంచి లియో తర్వాత వచ్చిన గోట్ సినిమా టైటిల్ కార్డు కూడా దీనిని బీట్ చెయ్యలేకపోయింది.
కానీ మన తెలుగు నుంచి వచ్చిన దేవర, ఆ తర్వాత ఓజి సినిమాల టైటిల్ కార్డ్స్ కి మాత్రం భారీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే తమిళ్ లో భారతీయుడు 2, ఇటీవల కూలీ సినిమాలకి వచ్చినవాటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో తమిళ్ కి ఆ సినిమాలు ఉంటే మనకి ఇవి ఉన్నాయని ఫ్యాన్స్ సర్దుకున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే లియో లాంటి ఫార్మాట్ లో తాను టైటిల్ కార్డు రెడీ చేయడం లేదని దర్శకుడు చెబుతున్నాడు.
ఇప్పుడు చేస్తున్న ‘విశ్వంభర’ కోసం చాలా కొత్తగా ప్లాన్ చేస్తున్నామని ఈ సినిమాలో గల 8 ప్రధాన అంశాలు కలిపి మెగాస్టార్ కోసం ప్రత్యేక టైటిల్ కార్డ్ ని సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. దీనితో ఫ్యాన్స్ లో డిస్కషన్ మొదలైంది. ఇది వరకే విశ్వంభర అనౌన్సమెంట్ వీడియోలో వశిష్ఠ తన క్రియేటివిటీ చూపించాడు. మరి ఇది మన సీనియర్ హీరోస్ లో ట్రెండ్ సెట్టింగ్ చేసే విధంగా ఉంటుందా లేదా అనేది థియేటర్స్ లో విశ్వంభర పడిన రోజునే తెలుస్తుంది. సో అప్పుడు వరకు ఆగి చూడాల్సిందే.
