ఈ ప్రేమికుల దినోత్సవం కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా తెలుగు హీరోయిన్ మానస వారణాసి హీరోయిన్ గా దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ఫీల్ గుడ్ ప్రేమ కథా చిత్రమే “కపుల్ ఫ్రెండ్లి”. డీసెంట్ బజ్ నడుమ వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ మన్ననలు అందుకొని మంచి రెస్పాన్స్ ని థియేటర్స్ లో అందుకుంటుంది.
అయితే ఈ సినిమాకి ఈ వారాంతంలో రెండు తెలుగు స్టేట్స్ లో పలు చోట్ల హౌస్ ఫుల్స్ తో షోస్ కూడా పడుతున్నాయి. అయినప్పటికీ ఈ చిత్రానికి మరింత ఆదరణ రావాల్సి ఉంది కానీ రావడం లేదని తెలుస్తుంది. నిర్మాతలు కూడా ఇదే చెబుతున్నారు ఎందుకంటే ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇవ్వడం మూలాన ఆ ప్రభావం అయితే వసూళ్లపై పడుతున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం చూసిన చాలా మందికి ఈ సినిమాకి ఎందుకు ఏ సర్టిఫికెట్ అని అనుకున్నారు.
పెదవి ముద్దులు లాంటివి ఉన్నాయి కానీ మరీ శృతి మించే రేంజ్ లో కూడా లేవు. వాటిని కూడా మిగతా బ్యూటిఫుల్ సన్నివేశాలు మర్చిపోయేలా కూడా చేస్తాయి. కానీ కేవలం ఈ సినిమా ఏ సర్టిఫికెట్ పొందడం వల్ల ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఫుట్ ఫాల్స్ అనుకున్న రేంజ్ లో ఈ సినిమాకి పడట్లేదు అన్నట్టు ట్రేడ్ వర్గాల్లో టాక్. అదే ఏ యూ/ఏ వచ్చి ఉంటే లెక్కల్లో వ్యత్యాసం ఖచ్చితంగా కనిపించేది అని ట్రేడ్ పండితుల మాట. మరి కపుల్ ఫ్రెండ్లి ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి.
