ఆయా షేర్ పై కూడా అనవసరపు నెగిటివిటీ!

The Paradise 1

నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న భారీ చిత్రమే ది ప్యారడైజ్. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా నుంచి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మొదటి సాంగ్ ఆయా షేర్ నిన్న వచ్చేసింది. మరి ఈ సాంగ్ విన్న వెంటనే ఎవరికైనా నచ్చేసే విధంగానే ఉంది. అయినప్పటికీ ఈ సాంగ్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం సాగుతోంది.

ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఈ తెలుగు సాంగ్ ని మలయాళం అంటూ మన వాళ్లే ట్రోల్ చేస్తూ ఉండటం దౌర్భాగ్యం.. ఇంకో షాకింగ్ అంశం ఏంటంటే నాని వేసిన డాన్స్ మూమెంట్స్ కి కూడా కొందరు వంకలు పెడుతున్నారు. ఇదంతా కేవలం ఈ సినిమా, నానిపై ఉన్న ద్వేషమే అనుకోవాలి. టాలీవుడ్ నుంచి ఒక మంచి ప్రొడక్ట్ వచ్చినప్పుడు దానిని మనం ఎంత వీలైతే అంత పుష్ చేసుకోవాలి కానీ ఇలా మనమే వెనక్కి లాగేయడం అనేది సమంజసం కాదు.

Exit mobile version