వారణాసి : తొలి ఇండియన్ సినిమాగా రేర్ ఫీట్.. జక్కన్న ప్లానింగ్ మామూలుగా లేదుగా…!

Varanasi

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘వారణాసి’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పూర్తి అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని ఇప్పటికే ఈ చిత్ర గ్లింప్స్ చూస్తే స్పష్టమయింది. ఇక ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ కోసం వారణాసి టీమ్ రెడీ అవుతోంది.

ఈ చిత్రానికి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్‌ను అంటార్కిటికాలో తెరకెక్కించేందుకు రాజమౌళి అండ్ టీమ్ రెడీ అవుతున్నారు. వీఎఫ్ఎక్స్ కంటే ఒరిజినాలిటీకే ప్రాధాన్యత ఇచ్చే జక్కన్న ఈ సినిమాను నిజమైన లొకేషన్స్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతో అంటార్కిటికా లాంటి ప్రదేశంలో సినిమా షూటింగ్ చేయడం చాలా రిస్క్‌తో కూడిన పని. అయినా కూడా జక్కన్న ఈ రిస్క్ తీసుకోవడంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.

అయితే, ఇప్పటివరకు అంటార్కిటికాలో ఏ భారతీయ సినిమా కూడా షూటింగ్ జరుపుకోలేదు. దీంతో వారణాసి ఈ రేర్ ఫీట్ చేయబోయే తొలి ఇండియన్ చిత్రంగా నిలువనుంది. మరి అంటార్కిటికాలో జక్కన్న ఎలాంటి కథను ప్రేక్షకులకు చూపెట్టబోతున్నాడా.. విజువల్‌గా ఈ మూవీ ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ ప్రెస్టీజియస్ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న వరల్డ్‌వైడ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version