టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు నటించిన రీసెంట్ చిత్రం ‘విష్ణు విన్యాసం’ గతవారం థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పూర్తి కామెడీ ఎంటర్టైనర్గా వచ్చినా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించడంలో ఫెయిల్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత వారం రోజుల గ్యాప్‌లో తన నెక్స్ట్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాడు శ్రీవిష్ణు.
పక్కా క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ‘మృత్యుంజయ్’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు శ్రీవిష్ణు. శ్రీ హుస్సేన్ షా కిరణ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కొందరు సెలబ్రిటీలకు స్పెషల్ షో వేశారు. అయితే, ఈ సినిమా చూసిన దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాపై తన రివ్యూని తెలిపారు. చాలా కాలం తర్వాత కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు నుంచి వస్తున్న ఓ గ్రిప్పింగ్ అండ్ ఇంటెన్స్ సినిమాగా ఇది నిలిచిపోతుందని.. అందుకే శ్రీ విష్ణుని ఇకపై కింగ్ ఆఫ్ కంటెంట్ అని పిలుస్తారని ఆయన తెలిపారు.
రెబా మోనికా జాన్, సుదర్శన్ తమ పాత్రలతో ఆకట్టుకున్నారని.. కాల భైరవ తన స్కోర్‌తో ఎంగేజ్ చేశారని రామ్ అబ్బరాజు తన రివ్యూని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలా శ్రీవిష్ణు మృత్యుంజయ్కు అప్పుడే పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
