పాన్ వరల్డ్ లెవెల్లో మంచి హైప్ ని సెట్ చేసుకున్న భారీ చిత్రాల్లో ఒకటే “వారణాసి”. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా హీరోయిన్ ప్రియాంక చోప్రా కలయికలో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ చిత్రాన్ని మాత్రం వరల్డ్ సినిమా దగ్గర ప్రియాంక చోప్రా ప్రమోట్ చేస్తున్నంత రీతిలో ఎవరూ చేయడం లేదనే చెప్పొచ్చు.
హాలీవుడ్ లో ప్రియాంక చోప్రాకి మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె అక్కడి మీడియా దగ్గర వీలు దొరికినప్పుడు అంతా ఈ సినిమా చర్చని తప్పకుండా తీసుకొస్తుంది. ఇలా అనేక హాలీవుడ్ ఇంటర్వ్యూస్ లో ఆమె వారణాసి ప్రస్తావన తీసుకువస్తుండడం ఈ సినిమాకి మరింత బూస్టప్ తీసుకొచ్చినట్టు అవుతుంది.
లేటెస్ట్ గా కూడా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆఫ్రికా షెడ్యూల్ లో ఆమె వర్క్ ఎక్స్ పీరియన్స్ కోసం చెప్పడం వైరల్ గా మారింది. ఇలా ప్రియాంక మాత్రం వారణాసి చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్లో ప్రమోట్ చేస్తుందని చెప్పాల్సిందే. ఇక ఈ భారీ సినిమాలో విలన్ గా పృథ్వీ రాజ్ సుకుమారన్ నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే కే ఎల్ నారాయణ మరియు ఎస్ ఎస్ కార్తికేయ భారీ వ్యయంతో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.
