తనకు కాబోయే సతీమణితో యంగ్ హీరో !

Bellamkonda Sreenivas

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తనకు కాబోయే సతీమణి కావ్యను ప్రేక్షకులకు పరిచయం చేశారు. కావ్యతో ఉన్న ప్రేమానుబంధాన్ని తెలుపుతూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఒక పోస్ట్‌ పెట్టారు. ‘నా జీవితంలోకి వచ్చినందుకు, సరైన సమయంలో నాపై విశ్వాసం ఉంచినందుకు, పాజిటివిటీ, రోజూ లెక్కలేనన్ని చిరు నవ్వులను నింపినందుకు థాంక్స్‌. నీ మోముపై కూడా చిరునవ్వులను ఎప్పటికీ వాడిపోనీయను. మనం ఎప్పటికీ కలిసి ఉండే క్షణం కోసం వేచి చూస్తున్నా. -ప్రేమతో నీ శ్రీని’’అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తన పోస్ట్ లో రాసుకొచ్చారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఇంకా తన పోస్ట్ లో తెలుపుతూ.. ‘నిశ్చితార్థం జరిగిందా’ అని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారని, ఆదివారం జరిగింది చిన్న వేడుక మాత్రమేనని ఆయన క్లారిటీ ఇచ్చారు. సంబరాలు ఇప్పుడే మొదలయ్యాయని త్వరలోనే తేదీలను ప్రకటిస్తానని బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ చెప్పుకొచ్చారు. శ్రీనివాస్‌కు కాబోయే భార్య పేరు కావ్య. హైదరాబాద్‌కు చెందిన ఆమెకు సినీ రంగంతో సంబంధం లేదు.

Exit mobile version