మాస్ మహారాజ రవితేజ హీరోగా డింపుల్ హయాతి అలాగే ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఎంటర్టైనర్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కోసం అందరికీ తెలిసిందే. ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా ఒక డీసెంట్ రన్ ని అయితే అన్ని సంక్రాంతి సినిమాల లానే అందుకుంది.
ఇక అక్కడ నుంచి ఫైనల్ గా మొన్ననే ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధం అయ్యింది. ఈ సినిమా ఓటిటి హక్కులతో పాటుగా శాటిలైట్ హక్కులు కూడా జీ సంస్థ వారే కొనుగోలు చేశారు. మరి ఫైనల్ గా ఈ సినిమా జీ తెలుగు వరల్డ్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.
ఈ మార్చ్ 22న సాయంత్రం 6 గంటలకి ఈ సినిమాని మొట్టమొదటి సారిగా టెలికాస్ట్ కి తీసుకురానున్నారు. మరి బుల్లితెరపై ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహించారు.
