ఓటీటీలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే..?

ustaad-bhagat-singh

దాదాపు 14 ఏళ్ల నిరీక్షణ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రేపు ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

​ఇక ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్‌లో చిత్ర నిర్మాత నవీన్ యెర్నేని సినిమా డిజిటల్ విడుదలపై కీలక ప్రకటన చేశారు. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన ఐదు వారాల తర్వాతే ఓటీటీలో అందుబాటులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఏప్రిల్ 24, 2026 నుండి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో వివిధ భాషల్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

​ఈ భారీ బడ్జెట్ చిత్రంలో శ్రీలీల మరియు రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తుండగా, కె.ఎస్. రవికుమార్, గౌతమి, పార్తీబన్, రావు రమేష్ వంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలు అందించగా, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లనున్నారు.

Exit mobile version