చిరు 158 పై అప్పుడే మెగా ఆశలు.. బాబీ ట్రీట్మెంట్ ఏమిటో..?

Chiru-Boby

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వేట మళ్ళీ మొదలుకానుంది! ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ తన లక్కీ డైరెక్టర్ బాబీ కొల్లితో కలిసి చేస్తున్న ‘Mega 158’ ప్రాజెక్ట్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్. ఈ సినిమా ఏప్రిల్ 11న పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం కానుండగా, ఏప్రిల్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ కాబోతోంది. ఒక పక్క ‘విశ్వంభర’ రిలీజ్‌కు సిద్ధమవుతుండగానే, బాబీ ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాను శరవేగంతో పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

​గతంలో వీరి కాంబోలో వచ్చిన వీరయ్య మాస్ ప్రభంజనాన్ని మించి ఈ సినిమా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ముఖ్యంగా ఈ సినిమాలో సెకండ్ హాఫ్‌లో వచ్చే 20 నిమిషాల ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని వినికిడి. ఇందులో ఓ యంగ్ హీరో కీలక పాత్రలో కనిపిస్తారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది, దీనికి థమన్ సంగీతం అందిస్తుండటం విశేషం.

​రికార్డుల వేటలో మెగాస్టార్ ఎప్పుడూ ముందే ఉంటారు. ‘Mega 158’ కోసం బాబీ ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ కథను సిద్ధం చేశారట. ఇందులో చిరంజీవి మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ రోల్‌లో కనిపిస్తారని, కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఎమోషనల్ డ్రామా కూడా పీక్స్‌లో ఉంటుందని సమాచారం. ఈ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.

Exit mobile version