2027లో బాలయ్య నుంచి డబుల్ ధమాకా!

Nandamuri-Balakrishna

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం తన హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో సాలిడ్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ 111వ సినిమాగా దీనిని గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య లైనప్ పై క్రేజీ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. దీని ప్రకారం ప్రముఖ దర్శకుడు కొరటాల శివ బాలయ్యని డైరెక్ట్ చేయనున్నట్టు వినిపిస్తుంది.

ఇక ఈ సినిమా సహా గోపీచంద్ యాహూ సినిమాలు వచ్చే ఏడాదిలోనే థియేటర్స్ లో సందడి చేయనున్నాయి అని తెలుస్తుంది. 2027 లో సంక్రాంతికి బాలయ్య 111వ సినిమా రానుండగా తర్వాత దసరా కానుకగా విడుదల చేయనున్నట్టు టాక్. సో ఇదే నిజం అయితే మాత్రం బాలయ్య అభిమానులకి డబుల్ ధమాకా అని చెప్పవచ్చు. మరి బాలయ్య, కొరటాల సినిమాపై అధికారిక ప్రకటన ఇంకా బయటకి రావాల్సి ఉంది.

Exit mobile version