మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం పెద్ది గ్రాండ్ గా ఇప్పుడు విడుదలకి రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను సాలిడ్ ఎమోషన్స్ మరియు మంచి యాక్షన్ సీక్వెన్స్ లతో తెరకెక్కించగా లేటెస్ట్ గా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఈ సినిమాలో కూడా హనుమాన్ రిఫరెన్స్ తో ఓ సీక్వెన్స్ ఉంటుంది అని ఖరారు చేశారు. ఇది గూస్ బంప్స్ తెప్పిస్తుందని కూడా చెబుతున్నారు. ఇది మాత్రం మెగా ఫ్యాన్స్ కి మరింత దగ్గరయ్యే సీక్వెన్స్ అనే చెప్పొచ్చు. మెగా కుటుంబం అంతా హనుమాన్ భక్తులని తెలిసిందే. తమ చిత్రాల్లో ఇవి మరింత ప్రత్యేకంగా కనిపిస్తాయి.
గతంలో రామ్ చరణ్ బెంచ్ మార్క్ చిత్రం ‘రంగస్థలం’ లో కూడా ఈ రిఫరెన్స్ ఉంది. మళ్ళీ ఇప్పుడు పెద్ది లో కూడా ఉందని చెబుతున్నారు. దీనితో థియేటర్స్ లో మాత్రం ఈ డివోషనల్ యాక్షన్ సీన్ కి పూనకాలు రావడం గ్యారెంటీ అని చెప్పాల్సిందే. ఇక బిగ్ స్క్రీన్స్ పై అది ఎలా ఉంటుందో ఈ జూన్ 4 వరకు వేచి చూడాలి.
